Market Crash: మార్కెట్లలో సడెన్ బుల్ క్రాష్.. ఆ మూడు రంగాలు ఢమాల్..
Markets Closing: ఉదయం సానుకూలంగా లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్లకు అనుకూలంగా కొనసాగకుండా యూటర్న్ తీసుకున్నాయి.
ఈ క్రమంలో మార్కెట్లలో పవర్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లోని కంపెనీల షేర్లు నష్టపోగా.. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం సానుకూల ప్రయాణాన్ని కొనసాగించాయి. ఎల్లుడి ప్రారంభం కానున్న బడ్జెట్ ప్రసంగంతో పాటు ఫెడ్ మీటింగ్ ఇన్వెస్టర్లను ఒత్తిడికి గురిచేశాయి. దీంతో చాలా మంది సేఫ్ గేమ్ అడేందుకు ముందుగానే నిన్నటి లాభాలను బుక్ చేసుకున్నారని నిపుణులు చెబుతున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 801 పాయింట్ల కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 209 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 129 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 211 పాయింట్ల మేర నష్టపోయింది. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, హిందాల్కొ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఎన్టపీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఎల్ టి, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, యూపీఎల్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications