Market Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ.. అమాంతం బేర్స్ పంజా దెబ్బ..
Stock Market: పండుగ ముగిసిన తర్వాతి రోజే దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కార్పొరేట్ కంపెనీలు విడుదల చేస్తున్న క్యూ3 ఫలితాలు ప్రస్తుతం కరెక్షన్ కు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 954 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 270 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1314 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 716 మేర నష్టాన్ని చవిచూసింది. నేడు మార్కెట్లు ప్రీఓపెనింగ్ సెషన్లోనే సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. మార్కెట్లో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, నెస్లే, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, సిప్లా, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, విప్రో, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications