Market Crash: పతనమైన Sensex, Nifty.. నిండా ముంచిన ఆటో సెక్టార్..
Market Closing Bell: ఉదయం లాభాల జోష్ లో మెుదలైన మార్కెట్ సూచీలు సాయంత్రానికి భేజారాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఇవి భారీగా నష్టపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 285 భారీగా పాయింట్లు క్షీణించింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్ప లాభాలతో 153 పాయింట్లు గెయిన్ అయ్యింది.

మార్కెట్ ట్రేడ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఫార్మాలోని మొత్తం 10 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 14 లాభపడగా.. 16 నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 23 అడ్వాన్స్‌డ్‌గా, 27 నష్టపోయాయి.
NSEలో సిప్లా, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, బ్రిటానియా, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications