Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు మిగిల్చాయి. ఆరంభంలో ఈ రోజు నష్టాలతో మెుదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింతగా క్షీణించాయి. ఉదయం పతనానికి హెచ్డీఎఫ్సీ రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి.

భారీ నష్టాలు..
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ మధ్య కాలంలో బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో బెంచ్‌మార్క్‌లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి, పెట్టుబడిదారులకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.277.58 లక్షల కోట్లకు పడిపోయింది. అలా మార్కెట్లు వారాంతంలో ఇన్వెస్టర్లకు కన్నీరు మిగిల్చాయి.

మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంలో ముగియగా.. నిఫ్టీ సూచీ 302 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 1084 పాయింట్లు, నిఫ్టీ మిండ్ క్యాప్ సూచీ 747 పాయింట్లను నష్టపోయాయి.
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటన తర్వాత రిజర్వు బ్యాంక్ త్వరలో రేట్లను పెంచనున్న తరుణంలో దేశీయ ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా నేడు బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి.

టాప్ లూజర్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి పవర్ గ్రిడ్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, యూపీఎల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్స్, యాక్సిస్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూసి చివరికి టాప్ లూజర్స్ జాబితాలో ముగిశాయి.

టాప్ గెయినర్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, ఐటీసీ కంపెనీలు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications