Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తలో అమ్మకాలకు దిగటంతో సెన్సెక్స్-నిఫ్టీ కుప్పకూలాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన కోసం వేచి చూస్తున్న వీరు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపారు.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 1 శాతానికి పైగా క్షీణతను నమోదు చేశాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 191 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 575 పాయింట్లు కోల్పోయాయి. వాస్తవానికి నేడు ఐటీ కంపెనీల షేర్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లు కుప్పకూలటానికి కారణంగా నిలిచాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టీసీఎస్, బీపీసీఎల్, సిప్లా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, టాటా కన్జూమర్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, ఎల్ టి, సన్ ఫార్మా కంపెనీల షేర్లు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications