Stock Market: ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు.. భయంలో ఇన్వెస్టర్లు..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల బాట పట్టాయి. నిన్నటి నష్టాల నుంచి ఇన్వెస్టర్లు కోలుకోక ముందరే నేడు పతనంతో కీలక సూచీలు ప్రయాణాన్ని ఆరంభించాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 136 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 316 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 249 పాయింట్లను కోల్పోయి ఇంట్రాడే ఆరంభంలో భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు మారిన గ్లోబల్ పరిస్థితులతో అమ్మకాలకు దిగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ సంభావ్య మధ్యప్రాచ్య భూయుద్ధాన్ని నిరోధించడానికి ప్రపంచ నాయకులు కృషిచేస్తున్నారు. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ బెదిరింపులు బెంచ్‌మార్క్ నిఫ్టీలో గణనీయమైన అస్థిరతకు కారణమైన ఉద్రిక్తతను పెంచాయి. దీనికి తోడు FII పెట్టుబడుల ఉపసంహరణ, పేలవమైన కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న US ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు తీవ్రమైన ఆందోళనలకు కారణమౌతున్నాయి.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, దివీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో విప్రో, హిందాల్కొ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, యూపీఎల్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications