Stock Markets: భారీ నష్టాల్లో ప్రారంభమైన దలాల్ స్ట్రీట్.. సేఫ్ గేమ్ ఆడుతున్న ఇన్వెస్టర్స్..
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లు ఊగిసలాటల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.16 మార్కెట్ల ప్రారంభంలో కీలక బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 523 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 129 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ పాయింట్ల 22 లాభంలో ఉండగా.. నిప్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 97 నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే ఊహాగానాలతో డాలర్ తిరిగి పుంజుకుంటోంది. ఒపెక్ దేశాల నిర్ణయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 80 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ఇదే క్రమంలో ట్రేడర్లు చైనా మార్కెట్ల రికవరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా క్యూ4 ఫలితాలను చాలా కంపెనీలు విడుదల చేస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
NSE సూచీలో పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, యూపీఎల్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, దివీ ల్యాబ్స్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ కంపెనీల నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications