Market Opening: కొత్త నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. బేర్ పంజా మార్కెట్లను భారీ నష్టాల్లోకి లాగేస్తోంది. ఈ తరుణంలో ప్రధానంగా దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 132 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 417 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 309 పాయింట్ల భారీ నష్టాలతో ఇంట్రాడేలో దలాల్ స్ట్రీట్ కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్లో మారుతీ సుజుకీ, అందానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

NSEలో నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, సిప్లా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, కోల్ ఇండియా, గ్రాసిమ్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications