Opening Bell: గ్లోబల్ మార్కెట్ల పతనంలో కొనసాగుతున్న వేళ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో కీలక బెంచ్ మార్క్ సూచీలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 560 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 171 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 354 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 314 పాయింట్లు నష్టపోయాయి. అలాగే ఈ క్రమంలో డిఫెన్స్ కేటగిరీలోని కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆసియా, అమెరికా మార్కెట్ల ప్రభావం నేడు భారతీయ ఈక్విటీలపై కనిపిస్తోంది.

ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు మాత్రమే మార్కెట్ల ప్రారంభ సమయంలో లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, టాటా స్టీల్, ఎల్ టి, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications