Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. నిండా ముంచిన మూడు రంగాలు..
Market Crash: చాలా కాలం ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. వారాంతంలో మార్కెట్లు ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను మిగిల్చాయి. ప్రధానంగా ఐటీ, మెటల్స్, ఎఫ్ఎమ్‌సిజి రంగాలు మార్కెట్లను కిందకు లాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 888 పాయింట్ల మేర నష్టపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్ఠంగా 1000 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత కొంత కాలంగా గరిష్ఠాలకు చేరుకున్న సూచీ వారాంతంలో చతికిలపడింది. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ సైతం ఇదే దారిలో 199 పాయింట్ల నష్టంతో వారాంతాన్ని ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 46 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 136 పాయింట్ల మేర నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.

ప్రధానంగా మార్కెట్లో కంపెనీల మెుదటి త్రైమాసిక ఫలితాలు నష్టాలకు ప్రేరేపించాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొనటం, రిలయన్స్ ఆదాయాలపై ఇన్వెస్టర్ల ఆందోళన ఆందోళనలకు కారణమయ్యాయి. ఆదాయ అంచనాలు తగ్గించుకోవటం ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీనికి తోడు అమెరికా కీలక సూచీలు ఆర్థిక మాంద్యం రావొచ్చని సూచించటం, అక్కడి మార్కెట్లు నష్టాల్లో ముగియటం భారత పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తోంది.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో ఎన్ఎస్ఈలోని ఎల్ టి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టీసీఎస్, రిలయన్స్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టిఐఎమ్, గ్రాసిమ్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా ఇన్వెస్టర్లకు కన్నీళ్లు మిగిల్చాయి.


Click it and Unblock the Notifications