Stock Market: వరుసగా మూడోరోజు కుప్పకూలిన మార్కెట్లు.. రక్తసిక్తమైన బ్యాంకులు..
Stock Market: వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో ట్రేడింగ్ సెషన్లోనూ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.68,000 కోట్లు కరిగిపోయింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 571 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 159 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో అత్యధికంగా నిఫ్టీ బ్యాంక్ సూచీ 761 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 359 పాయింట్లను కోల్పోయాయి. ప్రస్తుతం రేట్లు పెంచనప్పటికీ ఏడాది చివరి నాటికి పెంపులు ఉంటాయని ఫెడ్ పంపిన సంకేతాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను అతలాకుతల చేశాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ కనిపించింది.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, టైటాన్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఫార్మా రంగాల సూచీలు 1-2 శాతం మేర నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు నష్టాలను మూటకట్టుకుని టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications