Stock Market: భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. అమెరికా నుంచి ఆ సంకేతాలతో..
Stock Market: నిన్న ఫ్లాట్ ముగింపును నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ.. నష్టాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు నష్టాలను నమోదు చేయటం ప్రధాన కారణంగా ఉంది.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 420 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 287 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 130 పాయింట్ల నష్టాల్లో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో పేటీఎం, బీఈఎల్, ఆష్ట్రా మైక్రోవేవ్ కంపెనీల షేర్లు మార్కెట్లో ఫోకస్ లో ఉన్నాయి.

శుక్రవారం ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడనున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. అదుపుకాని ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్స్, హిందాల్కొ, విప్రో, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఎల్ టి, ఎస్బీఐ, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications