Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు రక్తపాతం జరిగింది. ఈ క్రమంలో కీలక సూచీలు కుప్పకూలాయి. ఉదయం ప్రీ ఓపెన్ మార్కెట్లో నష్టాలను చూసిన సూచీలు మార్కెట్ల ఆరంభం సమయంలో మంచి లాభాలతో దూసుకుపోయాయి. అయితే ఆ లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరయ్యాయి.

మార్కెట్ సూచీలు..
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ అత్యధికంగా 897 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 258 ఏకంగా పాయింట్లను నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 920 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 610 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్ ఓలటాలిటీ ఇండెక్స్ సైతం గరిష్ఠంగా 20 శాతం పెరిగింది. ఇది మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ ను సూచిస్తుంది.

నష్టాలకు కారణం..
మార్కెట్లు ముగిసే సమయానికి దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇంట్రాడే సమయంలో సెన్సెక్స్ సూచీ గరిష్ఠంగా 1000 పాయింట్లు కోల్పోయింది. ప్రధానంగా అమెరికాలోని రెండు బ్యాంకులు కుప్పకూలటం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనలను రేకెత్తించింది. గతవారాంతంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలాను మరవక ముందే అమెరికాకు చెందిన సిగ్నేచర్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఆందోళనల్లోకి నెట్టింది. బ్యాంకింగ్ సంస్థల పునాదుల నుంచి కదిలిపోవటం ప్రభుత్వాలను, సెంట్రల్ బ్యాంకులకు చెమటలు పట్టిస్తున్నాయి.

టాప్ గెయినర్స్..
మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ సూచీలో టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.

టాప్ లూజర్స్..
మార్కెట్ల క్లోజింగ్ లో సూచీలోని ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications