Stock Market Crash: కుప్పకూలిన మార్కెట్లు.. దలాల్ స్ట్రీట్ కొత్తవారం కష్టాల ప్రయాణం
Stock Market Crash: కొత్త వారం మార్కెట్లలో హుషారు కనిపించటం లేదు. ఆరంభంలోనే మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను బ్యాంకింగ్ సంక్షోభం ఆందోళనకు గురిచేస్తోంది.
మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాలను నమోదు చేయగా.. ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ సూచీ 159 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 396 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 256 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడిని భారీగా ఎదుర్కొంటున్నాయి.

ఎన్ఎస్ఈ సూచీలో కేవలం డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, మారుతీ, ఐషర్ మోటార్స్, టీసీఎస్, టాటా కన్జూమర్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్ననాయి.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రెండవ సెషన్లో మార్కెట్లు ఓలటాలిటీ నుంచి కుదుటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లు యూబీఎస్ క్రెడిట్ సూయిస్ బ్యాంకుల మధ్య కొలుగోను ఒప్పందం పూర్తిపై దృష్టి సారించాయి. ఈ డీల్ ఆసియా మార్కెట్లలో ఆవరించిన అస్థిరతలను చల్లార్చేందుకు దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications