Closing Bell: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ.. బేర్స్ రాకతో ఎరుపెక్కిన అన్ని రంగాలు..
Market Closing: ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సమయం గడిచిన కొద్ది నష్టాల్లోకి జారుకుని కుప్పకూలాయి. దీంతో కీలక బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 693 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 208 పాయింట్ల నష్టాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 746 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 449 పాయింట్లను కోల్పోయాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు నేడు 1 శాతం మేర నష్టంతో ట్రేడింగ్ ముగించాయి. వాస్తవానికి నేడు అన్ని రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగటం భారతీయ మార్కెట్ల పతనానికి కారణమైంది.

ఎన్ఎస్ఈలో టైటాన్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, నెస్లే, విప్రో, సన్ ఫార్మా, రిలయన్స్, టీసీఎస్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications