Market Crash: స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు.. కాంగ్రెస్ దూకుడుతో Sensex-Nifty బిగ్ క్రాష్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు ఫలితాల ప్రభావం క్లియర్ గా కనిపిస్తోంది. నిన్న భారీ దూకుడు కనబరిచిన మార్కెట్లు నేడు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి.
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్ కూటమి బీజేపీకి దగ్గరగా రావటంతో మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది.
సమయం గడుస్తున్న కొద్ది మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఉదయం 9.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 582 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. ఇదే క్రమంలో సెన్సెక్స్ సూచీ 1900 పాయింట్ల మేర నష్టపోయింది. కాంగ్రెస్ గెలుపు అంకెలు పెరుగుతున్న కొద్ది మార్కెట్లు మరింతగా బలహీన పడుతున్నాయి. మోదీ గెలుపు కొంత కష్టంమీదే జరగొచ్చని నిపుణులు వాస్తవ పరిస్థితుల బట్టి అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 1492 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1546 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, సిప్లా, నెస్లే కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు ప్రస్తుతం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications