Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నెల చివరిలోనూ నష్టాలను కొనసాగిస్తున్నాయి. వారం మెుదటి రోజే సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో వరుసగా ఏడవ రోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

మార్కెట్ సూచీలు..
ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 175 పాయింట్లు, సెన్సెక్స్ సూచీ 73 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 208 పాయింట్ల నష్టపోయాయి. ఈ క్రమంలో కేవలం నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 397 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ముఖ్య కారణాలు..
మార్కెట్లు నష్టాల్లో ముగియటానికి ప్రధానంగా బేర్స్ కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్ధతు లభించకపోవటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు అదానీ గ్రూప్ స్టాక్స్ తమ తిరోగమనాన్ని కొనసాగించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిందని తెలుస్తోంది.

టాప్ గెయినర్స్..
మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా తమ ప్రయాణాన్ని ముగించాయి.

టాప్ లూజర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, యూపీఎల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్, సిప్లా, ఎల్ అండ్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, హిందాల్కొ, ఐటీసీ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ గా నిలిచి నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications