Stock Market: ఒక్కసారిగా మార్కెట్ల నేల చూపులు.. సెలవు తర్వాత సీన్ రివర్స్..!
Stock Market: హోలీ సందర్భంగా నిన్న మూసివేయబడిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సూచీలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా స్టాక్ మార్కెట్లు నేడు ప్రీ ఓపెనింగ్ సెషన్లోనే నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 342 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 93 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 193 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 161 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కీలక అంశాలు..
ఫెడ్ ఛైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రకటన కారణంగా డాలర్ బలపడి మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇదే క్రమంలో జపాన్ జనవరిలో రికార్డు స్థాయిలో కరెంట్ ఖాతా లోటును నమోదు చేసింది.
గత ఏడాది చివర్లో జీడీపీ వృద్ధి మందగమనం కేవలం తాత్కాలికమైనదేనని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. టెక్ దిగ్గజం టీసీఎస్ 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. పవర్ గ్రిడ్ సంస్థ భారీ పెట్టుబడులను ప్రకటించటంతో స్టాక్ నేడు మార్కెట్లో దూసుకుపోతోంది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా లాభాల్లో దూసుకుపోతున్నాయి.

టాప్ లూజర్స్..
హిందాల్కొ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications