Stock Market: లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్-నిఫ్టీ.. గ్లోబల్ మార్కెట్ల జోరుతో..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నెల చివరి రోజున సైతం తమ ప్రయాణాన్ని సానుకూలంగా మెుదలుపెట్టాయి. నిన్నటి లాభాల పరంపరను కీలక సూచీలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంట్రాడే ఆరంభంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకింది.
ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 47 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం ఒడిదొడుకుల్లో కొనసాగుతూ 53 పాయింట్ల మేర నష్టంలో కొనసాగుతోంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 244 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతోంది.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, విప్రో, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని మార్కెట్ల ఆరంభంలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications