Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల పరంపరను నేడు కూడా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సానుకూలంగా ఉండగా.. టెలికాం రంగానికి చెందిన ఒడాఫోన్ ఐడియాతో పాటు ఇండస్ టవర్స్ కంపెనీల షేర్లు ఆరంభం నుంచే ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 64 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 97 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 235 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల క్యూ4 ఫలితాలు సానుకూలంగా ఉండటమే మార్కెట్ల జోష్ కొనసాగింపునకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, అపోరో హాస్పిటల్స్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, పవర్ గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎల్ టి, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications