Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మెుదటి రోజు నుంచి సానుకూలంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో 160 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 65 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 294 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియటం దేశీయ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచాయి. మార్కెట్ల ప్రారంభంలో సిప్లా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో టాప్ లూజర్లుగా నేడు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications