Market Opening: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసి నిన్నటి నష్టాలను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు ఫెడ్ మినిట్స్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 232 పాయింట్ల నష్టంలో ముందుకు సాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 56 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 192 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 87 పాయింట్ల మేర నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొంత మేర తగ్గించుకుంటున్నట్లు వెల్లడైంది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, బీపీసీఎల్, ఓఎన్డీసీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, నెస్లే, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హీరో మోటార్స్, విప్రో, హిందాల్కొ, నిఫ్టీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications