Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త నెలలో శుభారంభాన్ని నమోదు చేశాయి. గత నెలలో మాదిరిగానే రికార్డు బుల్ ర్యాలీ నేడు సైతం కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అందరి చూపు ఫెడ్ ప్రకటనతో పాటు కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై ఉంది.
ఉదయం 9.44 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 158 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 252 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా నేడు మార్కెట్లో ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో కొనసాగుతూ మార్కెట్లను ఉత్తేజపరుస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, మారుతీ, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, విప్రో, ఎల్ టిఐఎమ్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, సిప్లా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని మార్కెట్లో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి, బ్రిటానియా, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications