Market Crash: స్టాక్ మార్కెట్లను కమ్మేసిన ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. భారీ నష్టాల్లో సూచీలు..
Markets in War: ఇటీవల కొంత కాలంగా భారీ ర్యాలీని కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీ పతనం కొనసాగుతోంది. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం. దీంతో ప్రపంచ మార్కెట్లలో పెద్ద ప్రకంపనలు మెుదలయ్యాయి.
యుద్ధం అనిశ్చితి అలుముకున్న వేల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని కొత్త వారంలో ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయ 9.19 గంటల సమయంలో 663 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 202 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 551 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1054 పాయింట్ల భారీ నష్టాన్ని నిమిషాల్లోనే నమోదు చేశాయి.

నేడు మార్కెట్ల పతనానికి వివిధ కారణాలను పరిశీలిస్తే.. కార్పొరేట్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాల వెల్లడిని ప్రారంభించగా.. రిపోర్టింగ్ సీజన్‌కు మిశ్రమ ప్రారంభం తర్వాత శుక్రవారం అమెరికా మార్కెట్లలో స్టాక్స్ పతనమయ్యాయి. దీనికి తోడు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు ఆర్థిక మార్కెట్‌లను కుదిపేశాయి. ఈ భయాలతో నేడు దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు తమ డబ్బును ఈక్విటీల నుంచి సురక్షితమైన మార్గాల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి మెుదలైందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఓఎన్జీసీ, నెస్లే, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు మాత్రం లాభంలో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లలో ప్రధానంగా టీసీఎస్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఇంట్రాడేలో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications