Market Crash: వరుసగా మూడో రోజు సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. వాస్తవానికి సంక్రాంతి తర్వాత మార్కెట్లు కొంత కన్సాలిడేషన్ వైపు నడిచే అవకాశం ఉందని గతంలోనే నిపుణులు అంచనా వేశారు.
ఉదయం 9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 566 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో సూచీ నిఫ్టీ 195 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 334 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 844 పాయింట్ల మేర నష్టాలతో ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మార్కెట్ల నష్టాలకు కారణంగా కొనసాగుతోంది.

దీనికి వెనుక ఇతర కారణాలను పరిశీలిస్తే అమెరికా బాండ్స్ ఈల్డ్స్ సైతం 5 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇది పరోక్షంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనలను రేకెత్తించే సెంటిమెంట్లను ప్రేరేపించిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్లోకి పెట్టుబడిదారులు ఇతర కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాల విడుదల కారణంగా జాగ్రత్త పాటిస్తున్నారు.
ఎన్ఎస్ఈలో కేవలం యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, మారుతీ, సిప్లా, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications