Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ చివరికి సూపర్ గెయిన్స్ నమోదు చేశాయి. దీంతో కొత్త నెల మెుదటి రోజున సెన్సెక్స్ సూచీ ఏకంగా 24,100 స్థాయికి పైన స్థిరపడింది.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 131 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 233 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 556 పాయింట్ల మెగా ర్యాలీని నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఐటీ రంగంలోని కంపెనీలు ఉత్తమ పనితీరును కనబరచటంతో సూచీలు బుల్ జోరును కొనసాగించాయి. ఇదే క్రమంలో ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీలు లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఎయిర్ టెల్, టైటాన్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, హిందాల్కొ, రిలయన్స్, సిప్లా, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications