Stock Market: లాభనష్టాల్లో ఊగిసలాడిన మార్కెట్లు.. చివరికి ఆ రెండు రంగాల సపోర్ట్‌తో..
Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒపెక్ నిర్ణయం కారణంగా చాలా ఒడిదొడుకులకు లోనైంది. ట్రేడింగ్ మెుదటి సెషన్ లో మార్కెట్లలో మెుమెంటం లేదు. దీనికి తోడు ఇతర అంతర్జాతీయ కారణాలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటూ.. తిరిగి లాభాల్లోకి తేరుకుంటూ ఊగిసలాడాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో రంగంలోని షేర్లు మద్ధతుగా నిలవటంతో సూచీలు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు, నిఫ్టీ సూచీ 38 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 204 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 131 పాయింట్ల మేర లాభంతో క్లోజయ్యాయి. ప్రధానంగా క్రూడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి తగ్గింపు వంటి విషయాలు మార్కెట్లను భారీగా ప్రభావితం చేశాయి.

ఈ క్రమంలో డాలర్ తో రూపాయి 16 పైసలు నష్టపోయింది. NSE సూచీలో హీరో మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, మారుతీ, దివీస్ ల్యాబ్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఈ క్రమంలో బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, బ్రిటానియా, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications