Stock Market: ఒడిదొడుకుల్లోనూ భారీ లాభాలు.. ఇట్రాడేలో అదరగొట్టిన Sensex, Nifty..
Market Closing: ఉదయం తీవ్ర ఒత్తిడిలో ఫ్లాట్ ప్రారంభంతో మెుదలైన మార్కెట్లు ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాయి. దీంతో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్ల మేర లాభపడింది. ఇంట్రాడేలో సూచీలు గరిష్ఠాలను తాకాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 142 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 385 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ విజయవంతంగా ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాలు నేడు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

NSEలో కోల్ ఇండియా, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జియో ఫైనాన్షియల్, టాటా స్టీల్, హిందాల్కొ, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, దివీస్ ల్యాబ్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టైటాన్, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications