Stock Market: భారీ లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. ఇరగదీసిన స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం నష్టాల నుంచి తేరుకున్న తర్వాత నేడు మంచి లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మంచి పనితీరును కనబరచగా.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు సూచీలను కింకు లాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 181 పాయింట్ల మేర లాభాలతో నేడు తన ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 301 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 350 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు కొంత కుదుటపడటంతో దేశీయ మార్కెట్లలో మళ్లీ బుల్స్ జోరు మెుదలైంది.

ఎన్ఎస్ఈలో దివీ ల్యాబ్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications