Stock Market: 20,000 మార్కును తాకిన నిఫ్టీ సూచీ.. లాభాల్లో మార్కెట్ల కళకళ..
Closing Bell: G20 సూపర్ సక్సెస్ కావటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలు, ప్రకటనలతో అనేక రంగాలకు చెందిన షేర్లు రాకెట్ వేగంతో లాభపడ్డాయి.
ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అందరూ ఊహించినట్లుగానే 20,000 పాయింట్ల మార్కును సునాయాసంగా అధిగమించింది. ఇంట్రాడేలో అత్యధికంగా 20,008.10 మార్కును తాకి కొత్త 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ ఇండెక్స్ పెరుగుదల, US 10-సంవత్సరాల బాండ్లపై రాబడుల పెరుగుదల, ఎఫ్‌ఐఐల నిరంతర విక్రయాలు ఉన్నప్పటికీ నిఫ్టీ రికార్డు స్థాయిలకు చేరుకుంది.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 180 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 477 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 469 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని నేడు ముగించింది. అదానీ గ్రూప్ కంపెనీలు భారీగా లాభపడటంతో పాటు రైల్వే స్టాక్స్, బయో ఫ్యూయల్ కంపెనీల షేర్లు ర్యాలీకి దోహదపడ్డాయి.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, మారుతీ, యూపీఎల్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, నెస్లే, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, టీసీఎస్ కంపెనీలు లాభాలతో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications