Stock Market Crash: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా అదే ధోరణిని కొనసాగించాయి. ఈ క్రమంలో చివరికి నష్టాల్లోనే ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 99 పాయింట్లు లాస్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 308 పాయింట్లు నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 126 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్ల నష్టాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు దారితీశాయి. నెల చివరి రోజు మార్కెట్లలో ప్రధానంగా ఐటీ, హెల్త్ కేర్ రంగాల షేర్లలో కొనుగోళ్లు నమోదయ్యాయి. ఇదే క్రమంలో మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్ ముగింపుకు కొన్ని నిమిషాలు ముందు మార్కెట్లలో ఓలటాలిటీ అధికంగా కనిపించింది.
మార్కెట్లు ముగిసే సమయంలో NSEలోని టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, బీపీసీఎల్, బ్రిటానియా, నెస్లే, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా కన్జూమర్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, హిందాల్కొ, కోల్ ఇండియా, సిప్లా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎల్, యూపీఎల్, ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications