Crash Closing: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ముంచిన ఆ మూడు రంగాలు..!!
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమైనప్పటికీ కొద్ది క్షణాల్లోనే అది ఆవిరైంది. ఇన్వెస్టర్లు ప్రధానంగా లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో ప్రధాన వెయిటెడ్ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. ప్రధానంగా అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 427 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 109 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 380 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 156 పాయింట్లను కోల్పోయాయి. ఈ క్రమంలో ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాలకు చెందిన స్టాక్స్ సూచీలకు కిందకు లాగాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెలికాం, మీడియా రంగాలు 0.4-2 శాతం మేర క్షీణతను నమోదు చేసింది. ఇంట్రాడేలో భారీ నష్టాల నుంచి రికవర్ అయిన తర్వాత సూచీలు చివరికి క్షీణతను కొనసాగించాయి.

ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, గ్రాసిమ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, టాటా స్టీల్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications