Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆవిరైన ఉదయం లాభాలు..
Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో మెుదలైన మార్కెట్లు ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ గవర్నర్ ప్రకటనతో ఎగబాకాయి. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి భారీగా నష్టపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 294 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 92 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 280 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 188 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ క్రమంలో ఐటీ, రియల్టీ, ఆటో రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి.

FY24లో భారత ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువగానే ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సెంట్రల్ బ్యాంక్ రేట్లను మార్చకుండా ఉంచిన తర్వాత కూడా 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్‌పై రాబడి కొద్దిగా పెరిగింది. ఆస్ట్రేలియా, కెనడాలో పెంపుదల గురించి గవర్నర్ ప్రస్తావించారు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో కూడా బాండ్ ఈల్డ్స్ పెరిగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఎల్ టి, బజాజ్ ఆటో, సిప్లా, హీరో మోటార్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ లైఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్, టైటాన్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications