Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని చివరికి నష్టాల్లో ముగించాయి. ఈ క్రమంలో నాలుగో త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను ముందుకు నడపటంలో విఫలమయ్యాయి. మార్కెట్లలో అలుముకున్న అమ్మకాల ఒత్తిడికి సూచీలు నష్టాల్లోకి ఒరిగాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 384 పాయింట్లు నష్టపోగా.. మరో పక్క నిఫ్టీ సూచీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 610 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 988 పాయింట్లను కోల్పోయింది. అన్ని రంగాల షేర్లలో వ్యాల్యుయేషన్లు అధికంగా కొనసాగటం మార్కెట్ల పతనానికి దారితీసిందని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నేడు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.

ఎన్ఎస్ఈలో హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, నెస్లే, బ్రిటానియా, ఐటీసీ, టీసీఎస్, విప్రో, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, టైటాన్, టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫానాన్స్, టాటా స్టీల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో నేడు ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications