Market Closing: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన బ్యాంకింగ్ స్టాక్స్.. ఐటీ స్టాక్స్ ఢమాల్
Closing Bell: ఉదయం ఒడిదొడుకుల్లో స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే ధోరణిలో ప్రయాణాన్ని ముగించాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగియగా.. ఐటీ, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు మార్కెట్లను కిందకు లాగాయి. ఇదే క్రమంలో ఆటో, రియల్టీ స్టాక్స్ ర్యాలీని కొనసాగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 49 పాయింట్ల క్షీణతతో నేడు క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 125 పాయింట్ల పురోగతితో పాజిటివ్ క్లోజ్ నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ స్వల్పంగా 134 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి కీలక సూచీలు నేడు తమ నష్టాలను తగ్గించుకున్నాయి.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని సానుకూలంగా ముగించాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్, నెస్లే, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఎల్ టి, టాటా స్టీల్, ఐటీసీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications