Closing Bell: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా ఓలటాలిటీలో కొనసాగి చివరికి నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టపోగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 38 పాయింట్ల మేర నష్టంతో ప్రయాణాన్ని ముగించింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ కేవలం 1 పాయింట్ లాభంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 45 పాయింట్ల మేర గెయిన్ అయ్యి తమ ప్రయాణాన్ని లాభదాయకంగా ముగించాయి.

ఎన్ఎస్ఈలో మార్కెట్లు ముగిసే సమయానికి దివీస్ ల్యాబ్, ఎయిర్ టెల్, విప్రో, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బీపీసీఎల్, టీసీఎస్, మారుతీ, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, బ్రిటానియా, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజస్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, యూపీఎల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, ఎల్ టి, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, గ్రాసిమ్, హిందాల్కొ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications