Stock Market: ఊగిసలాడి నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఆవరించిన భయాలు..
Market Closing: ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన తర్వాత మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అయితే రోజంతా ఓలటాలిటీ మాత్రం మార్కెట్లను ఆవరించి అలాగే కొనసాగింది.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూ చీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 67 పాయింట్లు కోల్పోయాయి. వాస్తవానికి చివరి గంటలో మార్కెట్లలో కొనసాగిన అమ్మకాలు నష్టాలకు దారితీశాయి. ప్రధానంగా క్యూ3 ఫలితాలతో పాటు రిజర్వు బ్యాంక్ మీటింగ్ పై భయాలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా లాభాలను స్వీకరించారు.

NSEలో టాటా మోటార్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు మార్కెట్లు ముగిసే సమయానికి లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఎస్బీఐ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications