Market Closing: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిరాశపరిచిన RBI వడ్డీ రేట్ల నిర్ణయం..
Closing Bell: నేడు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. ఈ నిర్ణయం దేశీయ ఈక్విటీ మార్కెట్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 582 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 181 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 38 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 193 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. అత్యంత అస్థిర సెషన్‌లో నేడు భారతీయ బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 24,100 దిగువన ట్రేడింగ్ ముగించింది.

NSEలో టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి.
ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబ్, ఎల్ టి, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టాటా కన్జూమర్, విప్రో, బ్రిటానియా, ఓఎన్జీసీ, హీరో మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications