Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి తిరోగమనాన్ని కొనసాగించి చివరికి నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా దీనికి ఓలటాలిటి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
సాయంత్రం మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 35 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 407 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలో 438 పాయింట్ల నష్టంతో నేడు ట్రేడింగ్ ముగించాయి. అయితే నేడు ఇంట్రాడేలో మార్కెట్లో ఐటీ రంగానికి చెందిన షేర్లు సూచీల నష్టాలను తగ్గించటంలో దోహదపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా మార్కెట్లలో సానుకూలత ఉన్నప్పటికీ బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు సూచీలను నష్టాల్లోకి లాగాయి.

ఎన్ఎస్ఈలో ఎల్‌టి, విప్రో, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, గ్రాసిమ్, హిందాల్కొ, టీసీఎస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో మార్కెట్ల ముగింపు సమయంలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హీరో మోటార్స్, నెస్లే, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications