Market Closing: ఉదయం భారీగా నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు చివరికి బేజారులోనే ముగిశాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 161 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 39 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 84 పాయింట్లు ఎగబాకి లాభపడింది.

మార్కెట్లు ముగింపుకు ముందు 3 గంటల సమయంలో 1632 కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా.. 1817 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కేవలం 168 కంపెనీల షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇదే క్రమంలో దివాలాకు దాఖలు చేసిన గో ఫస్ట్ విమానయాన సంస్థ నుంచి తమకు ఎలాంటి చెల్లింపులు బకాయి లేవను యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ప్రధానంగా అమెరికా, ఆసియా మార్కెట్ల నెగటివ్ సెంటిమెంట్లు దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమయ్యాయి.
ఎన్ఎస్ఈ సూచీలో హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, మారుతీ, నెస్లే, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, రిలయన్స్, ఎస్బీఐ, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications