Market Closing: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి తమ ప్రయాణాన్ని నష్టాల్లోనే ముగించాయి. ప్రధానంగా అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు ఆసియాతో పాటు భారత మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
మార్కెట్లు క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ సూచీ 290 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సూచీ 75 పాయింట్ల నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 382 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 124 పాయింట్ల మేర నష్టపోయింది. మార్కెట్లు పవర్ సెక్టార్ కంపెనీల షేర్లు లాభపడినప్పటికీ.. ఫైనాన్స్ రంగానికి చెందిన షేర్లు చతికిలపడటంతో మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి.

నేటి ట్రేడింగ్‌లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇదే క్రమంలో బ్యాంకింగ్, ఐటీ, ఇంధన రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో.. 13 లాభపడగా, 17 నష్టాలతో ముగిశాయి. ఇక నిఫ్టీ-50 స్టాక్స్‌లో 20 లాభాల్లో, 30 నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
నిన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. యూరప్ లోని స్విస్ సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచింది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా నేడు కనిపించింది.
మార్కెట్ క్లోజింగ్ సమయానికి హిందాల్కొ, మారుతీ, నెస్లే, ఓఎన్జీసీ, ఐటీసీ, టాటా మోటార్స్, ఎయిర్ టెల్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, టైటాన్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలివర్ వంటి షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో ఎస్బీఐ, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications