Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిండా ముంచిన అదానీ స్టాక్స్..
Closing Bell: ఉదయం నుంచి ఒడిదొడుకుల్లో ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు అదానీ షేర్ల పతనంతో నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 256 పాయింట్ల మేర నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 243 పాయింట్లు నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 41 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, టైటాన్, హిందాల్కొ, కోల్ ఇండియా, విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, ఎస్బీఐ, గ్రాసిమ్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించి చివరికి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications