Stock Market: నష్టాల్లో వారాంతాన్ని ముగించిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో అన్ని రంగాలు..
Market Closing: ఉదయం భారీ నష్టాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే ధోరణిలో వారాంతాన్ని ముగించాయి. ఈరోజు మార్కెట్లో అన్న రంగాల షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 121 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 265 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 318 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, రియాల్టీ, పవర్ 1 శాతం చొప్పున క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్సియల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications