Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మార్కెట్లు మళ్లీ పెరుగుతాయా..??
Closing Bell: ఉదయం లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే వరస బుల్ రన్ తర్వాత నిఫ్టీ, సెన్సెక్స్ కొంత బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 378 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 91 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 217 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 174 పాయింట్లను కోల్పోయింది. స్వల్ప కాలకి కరెక్షన్ తర్వాత మళ్లీ మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయని బుల్ జోరు తిరిగి వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి కరెక్షన్ సర్వ సాధారణమేనని కోటక్ సెక్యూరిటీస్ అధికారి దీపక్ జసాని అన్నారు.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, విప్రో, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నేడు నిలిచాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, మారుతీ, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎల్ టి, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, నెస్లే, దివీస్ ల్యాబ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications