Stock Market: నష్టాల్లో ముగిసిన Sensex, Nifty.. ఇంట్రాడేలో లాభాలు ఆవిరి..
Closing Bell: ఉదయం లాభాల జోష్‌తో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. దీంతో కీలక సూచీలు చివరికి నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 17 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 94 పాయింట్ల లాభంలో చివరికి ట్రేడింగ్ ముగించింది. ప్రధానంగా మార్కెట్లను ఆటో, ఫార్మా, మెటల్ రంగాల షేర్లు నష్టపోవటంతో నష్టాల పాలు చేశాయి.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, రిలయన్స్, దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఎల్ టి, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, విప్రో, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications