Market Closing: ఉదయం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే ధోరణిలో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నేడు అన్ని రంగాలు గ్రీన్ కలర్లో క్లోజ్ అయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 496 పాయింట్ల మేర లాభం పడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 160 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్పంగా 12 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ భారీగా 716 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసింది.

NSEలో ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, టాటా స్టీల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, యూపీఎల్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలతో పాటు మరిన్ని స్టాక్స్ లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు మాత్రం ఎన్ఎస్ఈలో నష్టాలను నమోదు చేసి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications