Closing Bell: ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత ఒత్తిడితో చిత్తైనప్పటికీ తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీకి దోహదపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ 33 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 91 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 471 పాయింట్ల మేర లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఇంట్రాడేలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ప్రధారంగా 1 శాతం మేర పెరిగాయి.

US ద్రవ్యోల్బణం డేటా ఫెడరల్ రిజర్వ్ ద్వారా వడ్డీ రేట్ల పెంపును నిలిపివేసే అవకాశాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్‌లో జోరు కనిపించింది. 2023-24 పంట సీజన్‌లో మహారాష్ట్రలో చక్కెర ఉత్పత్తి 14 శాతం క్షీణించే అవకాశం ఉన్నందున గురువారం ఎన్‌ఎస్‌ఇలో చక్కెర మిల్లుల షేర్లు దాదాపు 13 శాతం పెరిగాయి. దాల్మియా షుగర్ షేర్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ధామ్‌పూర్ షుగర్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్, రాణా షుగర్, శ్రీ రేణుకా షుగర్స్, ద ఉగర్ షుగర్, ద్వారికేశ్ షుగర్, ఈద్ ప్యారీ, త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు 6 నుంచి 12 శాతం వరకు పెరిగాయి.
ఎన్ఎస్ఈలో యూపీఎల్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, నెస్లే, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, నెస్లే, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications