Stock Market: నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా భారీ ర్యాలీతో రికార్డుల మోద మోగించాయి. దీంతో దేశీయ బెంట్ మార్క్ ఈక్విటీ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు అతిచేరువలో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్ల ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1440 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 470 పాయింట్ల పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 763 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 702 పాయింట్ల వృద్ధితో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో అన్ని రంగాలకు చెందిన సూచీలు ఇంట్రాడేలో లాభాల జోరును చూడటంతో చివరికి సానుకూల లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.

వీక్లీ ఎక్స్‌పైరీ డే నాటికి మార్కెట్లు దాదాపు రెండు శాతం లాభపడి సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. సెషన్ చాలా వరకు అణచివేయబడినప్పటికీ, సెక్టార్లలోని హెవీవెయిట్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లు చివరి గంటల్లో సూచీని బాగా పైకి నడిపించాయని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ నిపుణుడు అజిత్ మిశ్రా వెల్లడించారు. మెటల్స్, ఆటో, ఇంధనం లాభాల్లో ముందుండడంతో అన్ని రంగాలు ర్యాలీకి దోహదపడ్డాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ కొత్త గరిష్ట స్థాయిని తాకడంతో విస్తృత సూచీలు కూడా అదే అనుసరించాయని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, విప్రో, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, టాటా స్టీల్, ఎల్‌టి, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే కేవలం నెస్లే షేర్లు మాత్రమే నష్టాలతో ముగిసి టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications