Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దంచికొట్టిన మెటల్ స్టాక్స్..
Stock Market: వారం మెుత్తం ఊగిసలాటను కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి. ప్రధానంగా పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు మార్కెట్లను ముందుకు నడిపాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 556 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో కొత్త నెలకు శుభారంబం పలికాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 447 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 327 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యూపీఎల్, ఎల్ టిఐఎమ్, విప్రో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications