Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని ఆశాజనకంగా కొనసాగించాయి. ప్రధానంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐఆర్ఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇంట్రాడేలో యాక్టివ్‌గా ఉన్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 184 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 143 పాయింట్ల మేర లాభంతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడ్డాయి.

NSEలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, ఎయిర్ టెల్, సిప్లా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, ఎల్ టి, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications